వంగిపోతున్న దేశానికి నింగి ఎత్తు వెన్నెముక


కలల రక్తానాళాల్లో రక్తం కాదు
భావితరాల కోసం బలైన ప్రాణాలు
ప్రవహిస్తున్నాయి!
వంగిపోతున్న దేశానికి నింగి ఎత్తు
వెన్నెముక
నిర్మించే పండగలో పాల్గొంటున్నాయి
జాతి బాహువులకు కండరాలై
ఛాతీకిరువైపులా
నిలవడానికి పరుగులెత్తుతున్నాయి...

-- శేషేంద్ర, వచ్చింది ఓట్ల ఋతువు 

ఇది దేశమా లేక కంఠపాశమా
అరే
ఈ మట్టికోసం బలి అయిపోయిన
ఆత్మల సమాధుల మీద
గడ్డి కూడా మొలవదు ఇక్కడ
రాజకీయ నాయకుడు ఇరుసుగా
తిరుగుతోంది పత్రికల భూగోళం
భూగోళం మీద కడుపుతో
పాకుతోంది చీమల్లాంటి కవీంద్రజాలం
కనుకనే నీవు కవుల్ని చూస్తున్నావు శేషేన్!
గడ్డి పరకల్ని చూచినట్లు తుఫాన్.

-- శేషేంద్ర

0 comments :: వంగిపోతున్న దేశానికి నింగి ఎత్తు వెన్నెముక

Post a Comment